
జహీరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైలాసం చేసుకునేందుకు ఆ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపు కోసం మద్నూర్ మండల ముఖ్య నాయకులు శుక్రవారం నాడు పల్లె గ్రామాల్లో పర్యటిస్తూ ముమ్మరంగా ఇంటింట ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు ఓటు వేసి సురేష్ షెట్కార్ ను గెలిపించాలని ముఖ్య నాయకులు పల్లె గ్రామాల్లో ప్రజలకు ప్రచారంలో విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమం మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దరాస్ సాయిలు ఆధ్వర్యంలో చేపట్టగా మండల మాజీ జెడ్పిటిసి సభ్యుడు జి సాయిబ్రావ్ మండల మాజీ జెడ్పిటిసి మాజీ ఎంపీపీ కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రామ్ పటేల్ చిన్న షక్కర్గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిగంబర్ మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంగమేశ్వర్ హనుమంతరావు దేశాయి కొండ గంగాధర్ జావీద్ పటేల్ వెంకట్రావు బండి గోపి చిన్న షక్కర్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు పటేల్ తదితరులు పాల్గొన్నారు.