కాంగ్రెస్ అధికారమే లక్ష్యంగా పని చేయాలి: సురేష్

నవతెలంగాణ -పెద్దవంగర: రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లక్ష్యంగా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సైనికుల పనిచేయాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. సోమవారం మండలంలోని కాన్వాయిగూడెం గ్రామ నూతన కమిటీ ఎన్నికకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకుల ఆటలు సాగవని, ప్రజలే వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం నూతన కమిటీ వివరాలను వెల్లడించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా కొండ మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా తండాల యాకయ్య,  ప్రధాన కార్యదర్శిగా ఈడబోయిన రాము, కోశాధికారిగా ఈడబోయిన రామ్మూర్తి తో పాటుగా, పలు అనుబంధ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండీ ముక్తార్ పాషా, తోటకూరి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఓరిగంటి సతీష్, బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఈదురు సైదులు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు సీతారాం నాయక్, మండల యూత్ అధ్యక్షుడు బీసు హరికృష్ణ గౌడ్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఎరుకల సమ్మయ్య గౌడ్, యూత్ ప్రధాన కార్యదర్శి ఆవుల మహేష్, ఎన్.ఎస్.యూ.ఐ మండల అధ్యక్షులు తాటిపాముల సంపత్ తదితరులు పాల్గొన్నారు.