మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన బాధిత కుటుంబాలను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ ఆధ్వర్యంలో నాయకులు సోమవారం పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన దీకొండ సోమయ్య (79), చిన్నవంగర గ్రామానికి చెందిన జర్నలిస్ట్ జలగం సోమశేఖర్ (43) మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్, మండల బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్, మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ జాను, మండల యూత్ అధ్యక్షులు బీసు హరికృష్ణ, చిన్నవంగర మాజీ ఎంపీటీసీ మెట్టు సౌజన్య నగేష్, బానోత్ వెంకన్న, రామ్ రెడ్డి, కందుల యాకరాజు, యాసారపు రవి తదితరులు ఉన్నారు.