బాధిత కుటుంబానికి ‘సురేష్’ పరామర్శ

నవతెలంగాణ – పెద్దవంగర: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన జలగం యాకయ్య (35) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్, యాకయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ఆయన వెంట సీనియర్ నాయకులు బోనగిరి లింగమూర్తి, మహమ్మద్ జానీ, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం వినోద్ గౌడ్, రమేష్, ఏదునూరి రాములు, యూత్ అధ్యక్షుడు చిలుక సంపత్, జలగం సతీష్, జలగం పవన్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.