– ఐపీఎల్‌కు సూర్య దూరం?
ముంబయి : భారత క్రికెట్ గాయాల బారిన పడుతోంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయంతో ఇప్పటికే జట్టుకు దూరమవగా.. తాజాగా ఆ జాబితాలోకి టీ20 సూపర్‌స్టార్ సూర్యకుమార్ యాదవ్ చేరాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ చీలమండ గాయానికి గురయ్యాడు. దీంతో స్వదేశంలో అఫ్గనిస్థాన్‌తో సిరీస్‌కు దూరమయ్యాడు. త్వరలోనే సూర్యకుమార్ జర్మనీలో శస్త్రచికిత్సకు వెళ్లనున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. 8-10 వారాలు విశ్రాంతి అవసరమని, ఐపీఎల్ ఆరంభ దశకు దూరమవుతాడని సమాచారం. ‘సూర్యకుమార్ స్పోర్ట్స్ హెర్నియాతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఎన్‌సీఏలో చికిత్స పొందుతున్నాడు. రెండు మూడు రోజుల్లో జర్మనీలో మ్యూనిచ్‌కు బయల్దేరతాడు. అక్కడే సూర్యకు శస్త్రచికిత్స చేయనున్నారు. 8-10 వారాల్లో కోలుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ ఆరంభ దశకు అందుబాటులో ఉండడు’ బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.