మిఠాయి బండారులపై ఆకస్మిక దాడులు

నవతెలంగాణ- భువనగిరి: భువనగిరి పట్టణంలోని స్వీట్ హౌస్ ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డాక్టర్ అండ్ సుమన్ కళ్యాణ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ స్వాతిలు మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వీట్ హౌస్లలో అపరిశుభ్రత ఎక్కువగా ఉందన్నారు. శుభ్రత పాటించాలని లేకపోతే త్రివరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి దగ్గర నుండి పలు శాంపుల్స్ స్వీకరించి హైదరాబాదులోని టెస్టింగ్ ల్యాబ్ కు పంపించారు. ఆహార శాంపిల్స్ కల్తీ అని తేలితే దాని ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.