సర్‌ప్రైజ్‌ చేసే.. డియర్‌ కృష్ణ

కృష్ణపీఎన్‌ బీ సినిమాస్‌ బ్యానర్‌ పై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ ‘డియర్‌ కృష్ణ’. పీఎన్‌ బలరామ్‌ రచయితగా, నిర్మాతగా ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ కథకు దినేష్‌ బాబు డైలాగ్స్‌, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం వహించారు. అక్షరు హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో ‘ప్రేమలు’ చిత్ర ఫేమ్‌  మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఐశ్వర్య కూడా మరో హీరోయిన్‌గా కనిపించనున్నారు. రియల్‌ ఇన్స్‌డెంట్స్‌ను ప్రేరణగా తీసుకొని పీఎన్‌ బలరామ్‌  యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా రాసుకున్నారు. హదయాన్ని బరువెక్కించే ఓ విషాద సంఘటన, శ్రీకష్ణుడిని నమ్మే ఒక భక్తుడు ఆ భారం అంతా ఆయనపై వేశారు. డాక్టర్లు కూడా ఏం చేయలేమన్న పరిస్థితుల్లో ఒక మిరాకిల్‌ జరిగింది. ఇలాంటి అద్భుతమైన ఇతివత్తంతో, నమ్మలేని నిజాలు కాదు ఎవరూ ఊహించలేని స్క్రీన్‌ప్లే రాసిన ఆ భగవంతుడు శ్రీ కష్ణుని దయతోనే ఈ సినిమా నిర్మించినట్లు నిర్మాత పీఎన్‌ బలరామ్‌ పేర్కొన్నారు. ఈ చిత్రం ఎంతో మందికి స్పూర్తిగా ఉంటుంది అని, అలాగే యూత్‌ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్‌ హంగులు ఈ సినిమాలో ఉన్నాయి అని డైరెక్టర్‌ దినేష్‌ బాబు చెప్పారు.