
అయితే ఈ డబ్బంతా తన తండ్రి దొర స్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో కూతురు పెండ్లికోసం దాచిన డబ్బంతా ఇలా తన ఇష్టానుసారం ప్రేమికుల కోసం వృధా చేస్తోందని పోలీసులు వివరించారు. నిత్యం ఫోన్ లో చాటింగ్ చేయటం.. ఫోన్లు మాట్లాడటం ద్వారా హరిత తన విషయాలు అన్నీ వాళ్లకు చెప్పేదని అంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో కూతురును తండ్రి దొరస్వామి పెండ్లి చేసుకోమ్మని ఒత్తిడి చేయడంతో కోపంతో ఈ నెల13న తండ్రి దొరస్వామిని కుమార్తె ఇంట్లోనే తీవ్రంగా కొట్టి చంపిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత హరితను అరెస్టు చేసి, విచారణ చేయగా తను ముగ్గురితో ప్రేమాయణం నడిపినట్లు తెలిసిందని పోలీసులు వివరించారు.