
మండలంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీని శనివారం ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి పరిశీలించారు. తప్పులు లేకుండా ప్రజలు అందించిన సమాచారాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయాలని డాటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, తదితరులు ఉన్నారు.