ఆర్జీ-3 ఏరియాలో పర్యటించిన సర్వే జీఎం

నవతెలంగాణ – రామగిరి 
సర్వే జనరల్ మేనేజర్ కార్పొరేట్  పి శశికాంత్ రవి మంగళవారం ఆర్జీ-3 ఏరియాలోని ఓసిపి-2 ఉపరితల గని సందర్శించి, వ్యూ పాయింట్ నుండి పని స్థలాలను పరిశీలించారు. అలాగే పని స్థలాల గురించి సర్వేపటంలో విశ్లేషించి మైన్ జీవితకాలం పెంచే విధంగా ఏలాంటి ప్రణాళికలను రూపొందించుకోవాలన్న విషయాలను సంబంధిత అధికారులకు సూచించారు.ఆయన వెంట ఏరియా సర్వే అధికారి ఎండి జైనుల్లా బద్దిన్, డీజీఎం సర్వే కార్పొరేట్ పి వెంకటేశ్వర్లు, సర్వే అధికారి జిఎల్ రాజు తోపాటుఇతర అధికారులు ఉన్నారు.