సర్వే నెంబర్ 340 ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవు: తహసీల్దార్

Survey No. 340 Legal action against encroachment of government land: Tehsildarనవతెలంగాణ – రెంజల్

రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ముందు భాగంలో ఉన్న 340 సర్వే నెంబర్ భూమిని కబ్జా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం పార్టీ భూమి లో ఆయన హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. మొత్తం 340 సర్వే సర్వే నంబర్ లో ఒక ఎకరం 30 గుంటలు కోర్టు పరిధిలో ఉన్నందున, మిగతా రెండు ఎకరాల భూమిలో ఎవరైనా కబ్జాకు ప్రయత్నిస్తే వారిపై చట్టం చర్యలు తప్పవని ఆయన హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఆయన వెంట ఆర్ ఐ రవికుమార్, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.