
జన్నారం మండలంలోని కొత్తపేటలో సాగుకు యోగ్యంకానీ భూములపై మండల అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్తపేట గ్రామ శివారులో స్థానిక తహశీల్దార్ రాజ మనోహర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సంగీత, ఏఈఓ అక్రమ్, పంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలో సాగుకు యోగ్యం కానీ భూముల సర్వే నిర్వహించారు. రైతు భరోసా విషయమై ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేను నిర్వహించామని వారన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉన్నారు.