మండలంలోని మానిక్ బండారు గ్రామ శివారులో వెలసిన వెంచర్ లొ దేవాదాయ భూములు కబ్జాకు గురైనాయని స్థానిక కార్పొరేటర్ రాయ్ సింగ్ జిల్లా కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదు మేరకు శనివారం మండల సర్వేయర్ కిషన్ నాయక్, అర్ఐ షఫీ వెంచారులో సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖకు సంబంధించిన 474, 499,480, 548, 503 సర్వే నెంబర్లలో సర్వే నిర్వహించారు. మరి కొద్ది రోజుల్లో హద్దులను సైతం గుర్తించి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాయ్ సింగ్, నీటి సంఘం మాజీ చైర్మన్ ప్రభు, గ్రామస్తులు పాల్గొన్నారు.