మండలంలోని ఖిలా వనపర్తి గ్రామంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు శుక్రవారం రోజున గ్రామములోని అన్ని ప్రభుత్వ భూములను సర్వేయర్ తో సర్వే చేయించి ప్రభుత్వ భూముల వివరాలను నివేదిక తయారుచేసి జిల్లా కలెక్టర్ గారికి పంపించనున్నట్లు స్థానిక తహసీల్దార్ ఎం.డి. అరిఫుద్దిన్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల గిర్దావర్, ఎన్. స్వరూప, మండల సర్వేయర్ ఎం.శ్రీనివాస్ మండల తాసిల్ దార్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.