డిసెంబర్ 2 నుంచి 15వ తేది వరకు కుష్టు వ్యాధిగ్రస్తుల సర్వేను నిర్వహిస్తున్నట్లు డీఏంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్వే వివరాలను వెల్లడించారు. జిల్లాలోని 22 పీహెచ్సీ, 5 అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో సర్వే కొనసాగుతుందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 54 కేసులు యాక్టివ్ గా ఉన్నాయన్నారు. కుష్టు వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే త్వరగా నయం చేయొచ్చని తెలిపారు. శరీరంపై పాలిపోయిన రాగి రంగులో మొద్దుబారిన మచ్చలు ఉంటే కుష్టుగా అనుమానించాలన్నారు. డిసెంబర్ 2 నుంచి ఇంటికి వచ్చే సర్వే బృందాలకు పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. కుష్టు రహిత జిల్లాను తయారు చేయడంలో ప్రజలు సహకారం అందించాలన్నారు.