కొనసాగుతున్న పంట ముంపు ప్రాంతాల సర్వే 

నవతెలంగాణ-గోవిందరావుపేట : మండల వ్యాప్తంగా వరదలకు ముంపుకు గురైన పంట ప్రాంతాలను వ్యవసాయ అధికారులు ముమ్మరంగా సర్వే చేస్తున్నారు. సోమవారం రాఘవపట్నం ప్రాంతంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారి ఎం దాదా సింగ్ విస్తృతంగా సర్వే నిర్వహించారు. నాగపట్నం సమీప ప్రాంతాల్లో ముంపుకు గురై ఇసుక మెట వేసిన పంట పొలాలను సందర్శించి రైతులతో మాట్లాడి వారు సాగు చేస్తున్న పంట వివరాలను పెట్టుబడి వివరాలను  సమగ్రంగా సేకరించారు. అదేవిధంగా మండల వ్యాప్తంగా ఉన్న ముగ్గురు వ్యవసాయ విస్తరణ అధికారులు కూడా విస్తృతంగా ఆయా ప్రాంతాల్లో సర్వేలను కొనసాగిస్తున్నారు. మరొకటి రెండు రోజుల్లో పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఇంకా సర్వే వర్తించని రైతులు ఎవరైనా ఉంటే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. రైతులెవ్వరు అసంతృప్తికి లోను కావద్దని ముంపకు గురైన వారి పంట పొలాలను సమాచారం అందించి సర్వేలో పాల్గొనాలని సూచించారు.