‘ఉస్మానియా’ రహదారుల సర్వే

– అధికారులకు సీఎం ఆదేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
గోషామహల్‌ స్టేడియంలో నిర్మిస్తున్న కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవన నిర్మాణం కోసం రహదారుల సర్వే చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఈమేరకు హైదరాబాద్‌లోని తన నివాసంలో అధికారులతో సమీక్షించారు. ఆస్పత్రి రహదారులపై పలు సూచనలు చేశారు. రహదారుల నిర్మాణం కోసం తక్షణమే సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలు తాగునీరు, విద్యుత్‌, డ్రైనేజీ కోసం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అన్నీ శాఖలతో సమన్వయం కోసం నోడల్‌ ఆఫీసర్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి దాన కిషోర్‌ నియామించారు. సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ ,హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.