కుష్టు వ్యాధి నివారణా పై శనివారం గహన్ మహల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డిబిఆర్ మిల్స్ పట్టణ ప్రాథమిక కేంద్రాలలో ఎ ఎన్ ఎం, ఆశ వర్కర్లకు లెప్రసీ, అవగాహన, కేసుల నిర్ధారణ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి పి ఎం ఓ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. డిసెంబర్ 2 తేదీ నుండి 15 వరకు ఇంటింటి సర్వే నిర్వహించాలని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సహకరించాలని కోరారు. ఒంటిపైన పాలిపోయిన, రాగి రంగులో, స్పర్శ జ్ఞానం లేని మచ్చలు, చెవి వెనక, ముంజేతులు కాళ్లు, చెవివేలుపల నూనె రాసినట్లు బొడిపెలు ఉన్నచో, పరీక్షలు చేయించుకొని డాక్టర్ గారి సలహా మేరకు తగిన చికిత్సలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గగన్ మహల్ పట్టణ ప్రాథమిక కేంద్రం డిఎల్ఓ డాక్టర్ మురళీధర్, డాక్టర్ రాజలక్ష్మి, ఎంపీహెచ్ఎస్ వై కృష్ణ, అమృత, డివిఆర్ మిల్స్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ అవంతి, పి హెచ్ ఎన్ విజయ, ఏఎన్ఎంలు ,ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.