పంట నష్టాలపై సర్వేలు కరువు పట్టించుకోని ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులు ఆందోళన

నవతెలంగాణ మద్నూర్

మద్నూర్ డోంగ్లి ఇరు మండలాల పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీటితో నష్టపోయిన పంటలకు పంట నష్టలపై ప్రభుత్వ అధికారులు సర్వేలు కరువయ్యాయని పంటలు నష్టపోయిన రైతులు ఆందోళన వ్యక్తం అవుతుంది మద్నూర్ మండలంలోని గోజేగావ్ సోనాల తడి ఇప్పర్గా గ్రామ శివారు లేండి వాగు వరద నీటితో భారీగా నష్టపోగా డోంగ్లి మండల పరిధిలోని లింబూర్ డోంగ్లి చిన్న టాక్లి పెద్ద టాక్లి సిర్పూర్ మాదన్ ఇప్పరుగా ఇల్లేగావ్ ఎనబరా కుర్ల తదితర గ్రామాల్లో పంటలు భారీగా నష్టపోయాయి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు వరద నీటితో నష్టపోయిన పంటలకు ప్రభుత్వము పంట నష్ట సర్వేలు చేయించాలని నష్టపోయిన రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇరు మండలాల పరిధిలో భారీగా నష్టపోయిన పంటలకు అధికారులు వెంటనే సర్వేలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదికలు అందించి నష్టపరిహారం అందే విధంగా చర్యలు చేపట్టాలని వ్యవసాయ రైతులు కోరుతున్నారు