
శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్ పాఠశాలలో శుక్రవారం రథసప్తమి సందర్భంగా విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు. రథసప్తమికి సంబంధించిన పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిర్వాహకులు, ప్రిన్సిపాల్ తోటకూర యాదయ్య యాదవ్, వైస్ ప్రిన్సిపల్ కౌసల్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.