సూర్యాపేట వాసికి బౌతీక శాస్త్రంలో పిహెచ్డి..

నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్..
షాద్ నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ఫిజిక్స్ విభాగం లెక్చరర్ గా పని చేస్తున్న సూర్యాపేట వాసి కె.ఎన్. ప్రసన్న కుమారి ఉస్మానియా యూనివర్సిటీ భౌతిక శాస్త్రంలో పీహెచ్ .డి పట్టా పొందారు.శనివారం డాక్టర్ ఎం. నరేంద్ర బాబు ఆధ్వర్యంలో “సింథసిస్ అండ్ క్యారక్టరైజేషన్ ఆఫ్ లెడ్ ఫ్రీ మల్టీఫెరోయిక్స్ కాంపోజిట్స్ “అంశంలో జరిపిన పరిశోధనకు గాను ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగిందని, ఇందుకు సహకరించిన తన గురువు డా.ఎం. నరేంద్ర బాబు డా. ఎన్.వి.ప్రసాద్ లకు తన తోటి ల్యాబ్ మేట్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా నిలిచిన కుటుంబసభ్యులకు , మిత్రులకు తోటి లెక్చరర్ లకు ప్రసన్న కుమారి ధన్యవాదాలు తెలిపారు.