భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాకు రెడ్ అలర్ట్

తుంగతుర్తి సిఐ శ్రీను నాయక్

నవతెలంగాణ తుంగతుర్తి:
జిల్లాలో భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు నదుల వద్ద ప్రవాహం అధికంగా ఉందని ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తుంగతుర్తి సిఐ శ్రీను నాయక్ తెలిపారు.శనివారం సూర్యాపేట జిల్లాలో తుఫాను కారణంగా రెడ్ అలర్ట్ జారీ చేసిన సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు.ఈ మేరకు జలాశయాలు చెరువులు,వాగుల వద్దకు సెల్ఫీల కోసం,చేపల వేటకు ఎవరు వెళ్లకూడదని విజ్ఞప్తి చేశారు.వరద నీటితో ప్రమాదకరంగా మారిన రోడ్లను దాటడానికి ప్రయత్నించి ప్రమాదాల బారిన పడవద్దు అని సరదా కోసం పిల్లలు యువకులు ఫోటోల కోసం ఈతలు కొట్టడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.అదేవిధంగా శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.ప్రజల సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వర్షాల వల్ల ఎలాంటి సహాయం కావాలన్నా 6281492368 నెంబర్ కు డయల్ చేయాలని సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు.