సూర్యాపేట పట్టణం మెడికల్ హబ్ గా మారుతుందని ప్రముఖ వైద్యులు డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్ అన్నారు.శనివారం జిల్లా కేంద్రం లోని విద్యానగర్ జనని డయాగ్నస్టిక్ సెంటర్ బిల్డింగ్ మొదటి అంతస్తు నందు ఏర్పాటు చేసిన వినూత్న డెంటల్ హాస్పిటల్ ను శనివారం నాడు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు వైద్య సేవల కోసం హైదరాబాదు కు వెళ్లవలసిన అవసరం లేకుండా కార్డియాలజి, న్యూరాలజి, గ్యాస్ట్రో ఎంట్రాలజి , నెఫ్టలజి వంటి ఆదునిక వైద్య సేవలు సూర్యాపేట లో అందుబాటులోకి వచ్చాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. విద్యానగర్ నందు వినూత్న డెంటల్ హాస్పిటల్ నెలకొల్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వినూత్న డెంటల్ హాస్పిటల్ వైద్యురాలు ప్రవళ్లిక మాట్లాడుతూ శనివారం, ఆదివారం, సోమవారం నాడు తమ ఆసుపత్రి నందు 50 శాతం డిస్కౌంట్ తో వైద్యం అందించబడుతుందని అన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వినూత్న హాస్పిటల్ యాజమాన్యం నగేష్, మధుకర్, డాక్టర్ ఉదయ్, డాక్టర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు.