యోగ లక్ష్మీ ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకం పై ఈశ్వర్, నయన సర్వార్ హీరో హీరోయిన్స్‌గా అభిమన్యు సింగ్ ముఖ్య పాత్రలో అర్.ఎక్స్ 100 ఫేమ్ పూజా ఐటమ్ సాంగ్‌లో చేస్తున్న చిత్రం ‘సూర్యాపేట్ జంక్షన్’. ఈ సినిమాలోని మూడవ సాంగ్‌ని ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ చేతుల మీదుగా మేకర్స్ విడుదల చేశారు. సి.కళ్యాణ్ మాట్లాడుతూ, ”చెంగు చెంగు..’ అంటూ సాయిచరణ్ పాడిన టీజింగ్ సాంగ్ చాలా బాగుంది. హీరో ఈశ్వర్, హీరోయిన్ నయన సర్వార్ ఈ పాటకు డాన్స్ బాగా చేశారు. డైరెక్టర్ విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సినిమా స్టోరీ ఎంచుకుని చాలా బాగా తీశారు. కొరియోగ్రాఫర్ ఈశ్వర్‌తో స్టెప్స్ బాగా చేయించాడు. రోషన్ సాలూరి మ్యూజిక్ కూడా బాగుంది. హీరో ఈశ్వర్‌కి ఈ చిత్రంతో మంచి హిట్ రావాలి’ అని అన్నారు.
‘మా సినిమాలోని రెండవ పాటని సి.కళ్యాణ్ చేతుల మీదుగా విడుదల చేయటం ఆనందంగా ఉంది. ఆయన బిజీ టైమ్‌లో కూడా అడిగిన వెంటనే సాంగ్ విడుదల చేయడానికి ఒప్పుకుని మూవీ కంటెంట్ చూసి ఇది మంచి సినిమా అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడవ సాంగ్ విడుదల చేసినందుకు మా టీమ్ తరపున కళ్యాణ్‌కి ప్రత్యేక కతజ్ఞతలు’ అని హీరో ఈశ్వర్ అన్నారు.
డైరెక్టర్ రాజేష్ నాదెండ్ల మాట్లాడుతూ, ‘ఇప్పటికే విడుదలైన టీజర్, ఐటమ్ సాంగ్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. హీరో ఈశ్వర్ హీరోయిర్‌ని టీజింగ్ చేసే ఈ మాస్ సాంగ్ అందరికీ నచ్చుతుంది’ అని చెప్పారు.
నిర్మాతలు మాట్లాడుతూ, ‘మా చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మిగిలిన అప్డేట్స్ త్వరలో తెలియజేస్తాం. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే సినిమా ఇది. సినిమా అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది. కచ్చితంగా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.