
మోపాల్ మండలం నర్సింగ్ పల్లి గ్రామంలోని ఇందూరు తిరుమల ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడవ రోజు అయిన సోమవారం సూర్యప్రభ చంద్రప్రభ వాహన సేవలను నిర్వహించారు. దేవదేవుల ఉత్సవమూర్తులను ఆలయ మాడవీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలను పర్యవేక్షిస్తున్న దేవనాథ జీయర్ స్వామి, అహోబిల జీయర్ స్వామి స్వామివారికి వాహన సేవ నిర్వహించడం వల్ల జరిగే ప్రయోజనాలను భక్తులకు వివరించారు. అలాగే భగవంతుడి నిర్వహణలో ఏ లోటు ఉండదు. ఆయన సృష్టి చాలా సౌందర్యంగా ఉంటది అని అన్నారు. మనిషిలో అంతర్యామిగా భగవంతుడు ఉంటాడు. ప్రతి చెట్టు పుట్ట రాయి అన్నింటిలో అంతర్యామిగా ఆ దేవదేవుడు ఉంటాడు. అన్నింటినీ నడిపే శక్తి ఆయనే ఇస్తాడు కాబట్టి ఆ దేవదేవుని సర్వదా కృతజ్ఞతా పూర్వకంగా వుండాలి అని అన్నారు. మూడవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వారు ఉదయం సూర్య ప్రభ వాహనం పై సాయంత్రం చంద్రప్రభ వాహనంపై మరియు గజవాహనంపై ఆలయ మాడ వీధుల గుండా ఊరేగినారు. ఈ కార్యక్రమంలో దేవనాథ జీయరు స్వామి, ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామివారు, ఆలయ ధర్మకర్తలు, నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, రవియాదవ్ నర్సారెడ్డి, నరాల సుధాకర్, ప్రసాద్, గంగారెడ్డి, లక్ష్మి, పాల్గొన్నారు. యజ్ఞాచార్యులు శిఖామణి స్వామి, శ్రీకర్ కుమారాచార్యులు, స్వామి రోహిత్ కుమారాచార్యులు, విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.