నవతెలంగాణ – చండూరు
నల్గొండలో అద్దంకి బైపాస్ రోడ్డు ఉన్న సుశ్రుత గ్రామీణ వైద్యం సంఘం 18వ వార్షికోత్సవానికి చండూరు గ్రామీణ వైద్యుల సంఘం సభ్యులు బుధవారం బయలుదేరారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షుడు దంతూరి సాయిలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పి ఎం పి, ఆర్ ఎం పి గ్రామీణ వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం గౌరవ అధ్యక్షులు నాగిళ్ళ నరసింహ, ప్రధాన కార్యదర్శి పోలగోని రమేష్, ఉపాధ్యక్షులు నల్పరాజు యాదగిరి, వేంపటి రవి, నేర్లకంటి రవికుమార్, సంగెపు మల్లేష్, దోర్నాల నరసింహ, మిర్యాల పురుషోత్తం, చోల్లేటి ద్రోణాచారి, సుంకరి యాదగిరి, సైదులు, రాజు, రహీం, చంద్రమౌళి, మహేష్, వెంకటేష్, జగన్నాథం, పాల్గొన్నారు.