17 నుండి అశ్వారావుపేట ఫాం ఆయిల్ పరిశ్రమ నిలిపివేత..

– వార్షిక మరమత్తుల నిర్వహణ..
– ఆయిల్ ఫెడ్ జీఎం సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట
పామ్ ఆయిల్  గెలలు  ఉత్పత్తి  తక్కువగా రావడం కారణంగా అశ్వారావుపేట ఫాం ఆయిల్ కర్మాగారం ఈ నెల 17 వ తేదీ గురువారం నుండి తాత్కాలికంగా నిలిపి వేయబడుతుంది అని ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ టీ.సుధాకర్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడాది వార్షిక మరమ్మత్తులు నిర్వహణ చేపడతామని తెలిపారు. ఇందు కారణంగా  రైతులు సహకరించి  తమ ఆయిల్ పామ్  గెలలు మొత్తం అప్పారావుపేట కర్మాగారానికి తరలించాలి అని ఆయన రైతులకు విజ్ఞప్తి చేసారు. అప్పారావుపేట కర్మాగారంలో యధావిధిగా అన్ లోడ్ జరుపబడును అని, రైతులు గమనించి ఫ్యాక్టరీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ విషయాన్ని అశ్వారావుపేట,అప్పారావు పేట పరిశ్రమల మేనేజర్ లు ఎం.నాగబాబు,జి.కళ్యాణ్ గౌడ్ లు వెల్లడించారు.