స్వవైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిలిపివేత

 స్వవైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిలిపివేత– బీజేపీ ఓటమితోనే సాధ్యం
– స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల జాతీయ సదస్సులో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
– వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రజల సంపద
– అమ్మే హక్కు ప్రధాని మోడీకి లేదు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిలిపివేత బీజేపీ ఓటమితోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నాడిక్కడ కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ ”విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ దేశ సంపద. ఆ సంపదకి ప్రధాని మోడీ మేనేజర్‌ మాత్రమే. దేశ ప్రజలు దాని యజమానులు. ప్రజల అనుమతి లేకుండా దేశ సంపదని అమ్మే హక్కు మోడీకి లేదు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలంటే 2024 ఎన్నికల్లో మోడీని గద్దె దించాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించకపోతే, వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటనే కాదు, దేశ రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడు కోలేం” అని అన్నారు. ”ప్రభుత్వ రంగాన్ని, దేశ సంపదను కాపాడుకోవాలి. అదే భవిష్యత్తు తరాలకు మనం అందించేది. దేశ సంపద, ఆస్తులు ప్రజలవి. అవి ప్రజల సార్వభౌమత్వంతో ముడిపడి ఉన్నాయి. అందుకోసమే ఆ ఆస్తులను సృష్టించాం. వాటిని మోడీ ప్రభుత్వం అమ్మేయడానికి ప్రయత్నిస్తోంది. దాన్ని తిప్పికొట్టాలి” అని పిలుపునిచ్చారు. ”కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. ఐదు వేల కోట్లు పెట్టుబడి పెడితే, దాన్ని కార్మిక వర్గం రూ.మూడు లక్షల కోట్ల సంపదకు పెంచింది. ఆ రూ.మూడు లక్షల కోట్లు ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిగా ఉంటుంది. అంతేగాని దాన్ని అదానీ, అంబానీ ఆస్తిగా మార్చకూడదు” అని అన్నారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతుగా ఉంటుందని, గత మూడేళ్లుగా ఆ పోరాటంలో సీపీఐ(ఎం) ముందుందని తెలిపారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో సీపీఐ పాల్గొంటుందని అన్నారు. ప్రధాని మోడీ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్‌ వ్యక్తులకు అమ్మేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ రాజేష్‌ నిలోతియా మాట్లాడుతూ మోడీ సర్కార్‌ వైఖరిని ఖండించారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తుందని అన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్‌ నర్సింగరావు మాట్లాడుతూ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ను రూ.లక్ష కోట్లతో విస్తరణకు ప్రభుత్వం యోచిస్తోందని, అయితే విస్తరించే బదులు, సెయిల్‌ లో వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌ జిత్‌ కౌర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాల పోరాటం కొనసాగుతోందని అన్నారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు పార్లమెంట్‌లో లేవనెత్తాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో కూడా వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు కేటాయింపులు తగ్గించారని విమర్శించారు. పార్ల మెంట్‌ ఉభయ సభల ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నిం చాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగిన బుద్ధి చెబుతామని అన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుదీప్‌ దత్‌, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి సచ్నాజ్‌ రఫీక్‌, వైజాగ్‌ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, సీబీఐ మాజీ డైరెక్టర్‌ జెడి లక్ష్మీనారాయణ ఐద్వా కోశాధికారి ఎస్‌.పుణ్యవతి, ఆప్‌ నేత మణి నాయుడు, ప్రత్యేక హౌదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీని వాస్‌, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు డి.ఆదినారాయణ, ఎం.రాజశేఖర్‌, జె.అయోధ్య రాము తదితరులు పాల్గొన్నారు.గ్రామాలకు తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఎడ్లబండ్ల మీదే వారి ప్రయాణం సాగుతుంది.