కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం పార్టీ నుండి సస్పెన్షన్ చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి గ్రూపుల మధ్య పచ్చ గడ్డి వేస్తే దగ్గు మనేలా రాజకీయాలు నడిచాయి. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కాకుండా, రాహుల్ గాంధీకి సన్నిహితంగా ఉన్న మదన్ మోహన్ రావుకు ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్లు ఇవ్వడంతో, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి సంతృప్తితో బీజేపీ పార్టీలో చేశారు. ఎన్నికల అనంతరం తిరిగి కాంగ్రెస్ డ్యూటీకి చేరారు. రామారెడ్డి మండలంలోని రంగంపేటలో సుభాష్ రెడ్డి విలేకరుల సమావేశంలో మదన్మోహన్రావుపై ఆరోపణలు చేయడంతో వివాదం అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో, సుభాష్ రెడ్డిని వివరణ కోరగా , నవంబర్ 21న వివరణ ఇచ్చిన అధిష్ఠానం ఆతృప్తి చెందకపోవడంతో శుక్రవారం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెన్నారెడ్డి లేఖను విడుదల చేశారు.