అనుమానాస్పదంగా వ్యక్తి మృతి 

Suspicious death of a personనవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి మండలం ఉగ్రవాయి గ్రామ శివారులో హై టెన్షన్ వైర్ల మీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం ఈ విషయంపై శనివారం ఉదయం సుమారు తొమ్మిది గంటల సమయంలో ఉగ్రవాయి గ్రామ శివారులోని హై టెన్షన్ వైర్లకు సమీపంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి చనిపోయినాడని దేవునిపల్లి పోలీస్ స్టేషన్  సమాచారం రాగా పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా అతని పేరు కోదండం రాజు అని జిల్లా కేంద్రంలోని గోసంగి కాలనీకి చెందిన వ్యక్తిగా దేవునిపల్లి పోలీసులు గుర్తించడం జరిగింది. ఇతని వయసు సుమారుగా 25 నుంచి 30 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ మృతి పై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు స్థానికులు తెలిపారు.