ఒక మహిళ అనుమానాస్పద మృతి…

నవతెలంగాణ-డిచ్ పల్లి

డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నడిపల్లి గ్రామానికి చెందిన వివాహిత హేమలత (24)  ఆరోగ్య సమస్యలతో సోమవారం రాత్రి సమయంలో మండల కేంద్రంలోని ఘాన్ పూర్ గ్రామ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.మంగళవారం ఉదయం చెరువు వద్ద కు వేళ్ళిన కోందరు గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చెందిన పలువురు చెరువు ఉన్న మృతదేహాన్ని బైటికి తీసారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలకి రెండేళ్ల పాప ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.ఈ మృతి అనుమానాస్పదంగా ఉందని,ఇంత చిన్న వయసులో ఆత్మహత్య ఎలా చేసుకుందో నాని పలువురు అనుమానం వ్యక్తం చేశారు.