
హుస్నాబాద్ మండలంలోని రాములపల్లి గ్రామంలో మర్రి ఓదెలుకు చెందిన 15 మేకలు శుక్రవారం అనుమానస్పదంగా మృతి చెందాయి. ఓదెలు ఉదయాన్నే మేత కోసం మేకలను తీసుకెళ్ళాడు.మధ్యాహ్నం సమయంలో మేస్తున్న 15 మేకలు మృత్యువాత పడ్డాయి.10 మేకల పరిస్థితి విషమంగా ఉందని ఓదెలు ఆవేదన వ్యక్తం చేశాడు. జీవనాధారమైన మేకలు మృతి చెందడం కుటుంబం రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. మేకలమృతి తో రూ. 3లక్షల వరకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు.మేకల మృతి పై అధికారులు పూర్తి విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.