– రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
– చారిత్రాత్మకమైన దేవుళ్ల గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు తెలియచేసే విధంగా ఉండాలి
నవతెలంగాణ – తాడ్వాయి
మేడారంలో శాశ్వత అభివృద్ధి పనుల అంచనా ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. ఆదివారం ఐటిడిఏ గెస్ట్ హౌస్ లో 2024 శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర ఖర్చులు, మేడారం అభివృద్ధి కార్యక్రమాలపై రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటిడిఏ పి.ఓ. చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి. శ్రీజ, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి. హెచ్. మహేందర్ జి, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ కే. సత్యా పాల్ రెడ్డి లతొ సమీక్షా సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో క్యూలైన్స్ పై షెడ్స్ నిర్మాణం చేపట్టాలని, గిరిజన పూజారుల నుంచి అభ్యంతరాలు తలెత్తితే వారికి అర్థమయ్యేలా పిపిటిల ద్వారా వివరాలను ప్రదర్శించాలని తెలిపారు. వర్షాకాలం తర్వాత అక్టోబర్ మాసం నుంచి పనులు సాఫీగా జరుగుతాయని తెలిపారు. అందరూ అధికారులు కలిసి సమన్వయం తో జాతర విశిష్టత తెలియజేసే విధంగా పనిచేయాలని సూచించారు. అధికారులు మనస్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని మేడారం జాతరకు వచ్చే భక్తులకు అణువణువునా సమ్మక్క సారమ్మ దేవతల ఆధ్యాత్మిక కనబరిచే విధంగా ఈ ప్రాంతాన్ని రూపొందించాలని, జంపన్న వాగు పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని, మేడారం జంపన్న వాగు పరివాహక ప్రాంతం చుట్టూ చెట్ల పెంపకం, పార్క్స్, హట్స్ ఏర్పాట్లకు సంబంధించి సలహాలు సూచనలు అందించాలని తెలిపారు. మేడారం జాతర అభివృద్ధి పనులను అంకితభావంతో నిర్వర్తించాలని తెలిపారు.
రైతులకు పండ్ల చెట్ల పంపిణీ
మేడారంలోని పగిడిద్దరాజు, గోవిందరాజు భవన్ ల వద్ద రైతులకు పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. మొక్కలు పెరివిగా పెంచడం వలన పర్యావరణం సమతుల్యత ఏర్పడి వర్షాలు బాగా పడి పంటలు పండుతాయి అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు లో చేనుల గట్ల పైన వీలున్న ప్రతి చట మొక్కలు నాటాలన్నారు.
కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణీ
మేడారంలోని గెస్ట్ హౌస్ లో మంత్రి సీతక్క 20 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి షాద్ ముబారక్ చెక్కులను అందజేశారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పేద విద్యార్థులకు రూ.3,62, 598 రూపాయల చెక్కుల పంపిణీ
11 మంది నిరుపేద విద్యార్థులకు ప్రవేశ రుసుము ప్రయాణ ఖర్చులు సీటు కేటాయింపు రుసుము మెస్ డిపాజిటివ్ అడ్మిషన్ ఫీజుల అవసరాల కొరకు 11 మంది విద్యార్థులకు 3 లక్షల 62 వేల598 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు.
5 వ తేదీ నుండి 9 వ తేది వరకు ఐదు రోజులు నిర్వహించనున్న స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో అధికారులు అద్భుతంగా విధులు నిర్వహించి మొక్కలు నాటాలని సూచించారు. మంచిగా విధులు నిర్వర్తించిన ప్రత్యేక అధికారికి స్వాతంత్ర దినోత్సవం రోజు సత్కరించడం జరుగుతుందని తెలిపారు. ములుగు జిల్లా ను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దాలని మంత్రి కోరారు.
గత జాతరలో ప్రభుత్వం రూ.110 కోట్ల రూపాయలు
గత జాతర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం 110 కోట్ల రూపాయలు కేటాయించిందని, వాటిలో సివిల్ వర్క్స్ కు 66 కోట్లు, జాతర నిర్వహణకు 24 కోట్లను ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు. మరో 20 కోట్ల రూపాయలను ఇప్పుడు జరిగే అభివృద్ధి పనుల కోసం ఉంచామని, బడ్జెట్ సమావేశాలలో ఐటిడిఏ బడ్జెట్ నుంచి మరో 50 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగిందని వాటిని కూడా శాశ్వత అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు.
మన నేషనల్ హైవే ను సమ్మక్క సారలమ్మ కారిడార్గ్ గా అభివృద్ధి
మన జాతీయ రహదారి సమ్మక్క సారలమ్మ కారిడార్లుగా చేయాలని , వివిధ ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలలో జిల్లాలలోని పర్యాటక కేంద్రాలు చారిత్రాత్మక ప్రదేశాల గూర్చి తెలిసే విధంగా, వచ్చే పర్యాటకులను భక్తులను ఆకర్షించే విధంగా చిహ్నాలు, థీమ్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాకు వచ్చే పర్యాటకులు ఎక్కువగా ప్లాస్టిక్ వినియోగిస్తున్నారని రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ నిషేధం పై ఒక ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసి ప్లాస్టిక్ర రహితంగా ఏర్పాటు చేస్తామని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎన్పీడీసీఎల్ మల్చుర్, ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ మల్లేశం ఈ ఈ ఆర్ అండ్ బి వెంకటేశ్, ఈ ఈ పంచాయతీ రాజ్ అజయ్ కుమార్, ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ వీరభద్రం, ఎండోమెంట్ ఈ ఓ రాజేందర్, మండల ప్రత్యేక అధికారి డి ఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, జిల్లా పర్యటక శాఖ అధికారి సూర్య కిరణ్ తాడ్వాయి తహసిల్దార్ రవీందర్, ఎంపీడీవో, సుమన వాణి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.