నిలకడగా బుద్ధదేవ్‌ ఆరోగ్యం

Sustained health of Buddhadev – వెంటిలేటర్‌పై కొనసాగుతున్న చికిత్స
కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు బుద్ధదేవ్‌ భట్టాచార్య (79) ఆరోగ్యం క్లిష్టంగానే ఉన్నా, నిలకడగా ఉందని వైద్య నిపుణులు తెలిపారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఆయనను నగరంలోని ఉడ్‌ల్యాండ్స్‌ ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే. బుద్ధదేవ్‌ కొంతకాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.