
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో సుతారి కావ్య ప్రథమ స్థానం సాధించింది. బుధవారం మండల కేంద్రము తొగుటకు చెందిన సుతారి లావణ్య దేవేందర్ కూతురు సుతారి కావ్య సిద్ది పేట మాస్టర్ మైండ్ కళాశాలలో విద్యను అభ్య సిస్తుంది. ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం వెలువడిన ఫలితాలలో 470 మార్కులకు గాను 468 మార్కులతో విజయం సాధించింది. రాష్ట్ర స్థాయిలో కావ్య ప్రథమ ర్యాంకు సాధించినందుకు తల్లిదండ్రులు, గ్రామ స్థులు,బీడీ కార్మికులు కృత జ్ఞతలు తెలిపారు.