సుతీర్థ ముఖర్జీ సంచలనం

Sutirtha Mukherjee is a sensation– 40వ ర్యాంకర్‌పై గెలుపు
– ఆసియా టేబుల్‌ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌
ప్యాంగ్‌చాంగ్‌(ద.కొరియా): ఆసియా టేబుల్‌ టెన్నిస్‌(టిటి) ఛాంపియన్‌షిప్‌ మహిళల సింగిల్స్‌లో సుతీర్థ ముఖర్జీ సంచలనం నమోదు చేసింది. తనకంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న చైనీస్‌ తైపీకి చెందిన సు-యు-చెన్‌ను చిత్తుచేసి రౌండ్‌-32కు ప్రవేశించింది. గురువారం జరిగిన రౌండ్‌-64 మహిళల సింగిల్స్‌ పోటీలో ప్రపంచ 104వ ర్యాంకర్‌ సుతీర్థ ముఖర్జీ 40వ ర్యాంకర్‌పై 10-21, 11-8, 11-7, 11-7తో గెలిచింది. ఇక భారత్‌కే చెందిన మనిక బత్రాకు తొలిరౌండ్‌లో వాకోవర్‌ లభించింది. మరో పోటీలో అహితా ముఖర్జీ 11-2, 11-0, 11-1తో నేపాల్‌కు చెందిన సువాల్‌ సిక్కాపై నెగ్గింది. ఇక స్టార్‌ టిటి ప్లేయర్‌ శ్రీజ ఆకుల 5-11, 6-11, 9-11తో 8వ ర్యాంకర్‌ మిమా ఇటో(జపాన్‌) చేతిలో, దియా ఛితాలే 3-11, 6-11, 8-11తో 2వ ర్యాంకర్‌ చైనాకు చెందిన చెన్‌ మెంగ్‌ చేతిలో ఓడారు. ఇక మహిళల డబుల్స్‌లో అహితా-సుతీర్థ 11-1, 13-11, 10-12, 11-7తో కజకిస్తాన్‌ జంటను ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. ఇక పురుషుల జట్టు కాంస్య పతక పోటీలో ఓటమిపాలై నిరాశపరిచారు.