హైదరాబాద్ : సూత్రా ఎగ్జిబిషన్ జూన్ 25 నుంచి 27వ తేది వరకు హైదరాబాద్‌లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. తాజ్‌క్రిష్ణాలో మూడు రోజుల పాటు ప్రదర్శన, అమ్మకాలు జరుగుతాయని సూత్రా ఎగ్జిబిషన్ అధినేత ఉమేష్ వెల్లడించారు. సూత్రా ఎల్లప్పుడూ సంస్కృతి, సంప్రదాయతలు, ఆధునిక ఫ్యాషన్లు, రాయల్ సొగసులను ప్రతిబింబించు వస్త్ర సముదాయాలు ప్రదర్శిస్తుందన్నారు. దేశంలోని నలుమూలల నుంచి 85 మందికి పైగా డిజైనర్లు, నిపుణులైన కళాకారులు తమ వస్త్ర, అభరణాలన్నింటిని ఒకే వేదిక పైన సందర్శకులకు అందుబాటులో ఉంచుతారన్నారు.