ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాల కామారెడ్డి కి చెందిన ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీ మేయిన్ క్యాంపస్ లో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కామర్స్, మేనేజ్మెంట్ కాలేజ్, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, క్యాంపస్ చుట్టుప్రక్కల ఉన్నటువంటి చెత్తాచెదారాలను, ముళ్లపొదలను తొలగించారు. ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ ఏరివేసి పరిసరాలను శుభ్రం పరిచారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి లు పరిశీలించి వాలంటీర్లను అభినందించారు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రవీందర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తెలంగాణ యూనివర్సిటీలోని క్యాంపస్ చుట్టుప్రక్కల శుభ్రం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇలాంటి సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులకి సామాజిక దృక్పథం పై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్కే సీఈవో డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి, డీన్ నవీన్ కుమార్, కోఆర్డినేటర్ దత్తాద్రి, ప్రిన్సిపల్స్ సైదయ్య, గోవర్ధన్ రెడ్డి ,గంగాధర్, వైస్ ప్రిన్సిపల్స్, ఎన్ ఎస్ ఎస్ పిఓఎస్ వెంకటేశ్వర్లు, లింగం, నర్సారెడ్డి, మురళి, రాజు, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.