బషీరాబాద్ క్రికెట్ గ్రౌండ్లో స్వచ్ఛభారత్ కార్యక్రమం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి
మండలంలోని బషీరాబాద్ గ్రామంలోని బషీరాబాద్ క్రికెట్ మైదానంలో మంగళవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు.స్థానిక గ్రామపంచాయతీ,  గ్రామ కమిటీ ఆధ్వర్యంలో క్రికెట్ మైదానాన్ని చీపురులతో కూడిచి శుభ్రం చేశారు. మైదానం లోపల పిచ్చి మొక్కల్ని, చెత్తను తొలగించి, ఏపుగా పెరిగి మైదానంలో ఇబ్బందిగా ఉన్న చెట్లును కోత మిషన్ తో కోయించారు. మైదానం చుట్టూ ఏర్పాటుచేసిన విద్యుత్ బల్బులు పాడైన చోట కొత్త బల్బులను అమర్చి సరి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సక్కరం అశోక్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఆకుల బాజన్న, కార్యదర్శి తోపారపు గంగాధర్, బీసీ అధ్యక్షులు బందెల రాజు, రంజిత్, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.