మండలంలోని హస కొత్తూర్ గ్రామంలో ఆదివారం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ ఏనుగు పద్మ రాజేశ్వర్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని విధులను ఊడ్చి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత గ్రామ ప్రజలందరిపై ఉందన్నారు. వీధిలో చెత్తాచెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గ్రామ పంచాయతీ ద్వారా అందించిన చెత్తబుట్టలోనే నిల్వ చేసుకోవాలని సూచించారు. చెత్త సేకరణ కోసం పంచాయతీ టాక్టర్ వచ్చినప్పుడు అందులో వేయాలన్నారు. చెత్తను మురికి కాలువలో వేయడం ద్వారా దోమలు వృద్ధి చెంది ప్రజలు విశ్వ జ్వరాల బారిన పడే ఆస్కారం ఉంటుందన్నారు. గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా నిలిపేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి నరసయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వసంత్ నాయక్, మెడపు రమేష్, నాగేశ్వర్, కుందేటి శ్రీనివాస్, లక్ష్మి నరసయ్య, గంగారం, రాజ నరసయ్య, శ్రీనివాస్, లింగారెడ్డి, మురళి, గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.