హెచ్పిసిఎల్ వారి ఆధ్వర్యంలో శనివారం భువనగిరి పట్టణంలోని ఖిలాపైన స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ స్వచత శుభ్రత కార్యక్రమం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సికింద్రాబాద్ టెర్మినల్ ఘట్కేసర్ వారి ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కోట యందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా హెచ్పిసిఎల్ సిబ్బంది చెత, ప్లాస్టిక్ వ్యర్ధాలను ఏరవేసి భువనగిరి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ కు పంపించడం అనంతరం చెత్తకుండీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్పిసిఎల్ డీజిఏం ఇన్స్టాలేషను పురాణం ప్రకాష్, చీఫ్ మేనేజర్స్ రాజేశ్వర్ ముషం, షేక్ అల్తాఫ్ మరియు డైరెక్టర్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియం, హెచ్పిసిఎల్ సిబ్బంది పాల్గొన్నారు .