
స్వచ్ఛ ధనం- పచ్చదనం చివరి రోజు కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మండల కేంద్రంలో శుక్రవారం పాల్గొన్నారు. స్థానిక పాఠశాలలో, కస్తూర్బా గురుకుల పాఠశాలలో మొక్కలు నాటి నీరు పోశారు. మధ్యాహ్న భోజనాన్ని, రికార్డులను పరిశీలించారు. కస్తూర్బా గురుకుల పాఠశాలలో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మద్దికుంట లో డి యల్ పి ఓ శ్రీనివాస్ తో కలిసి ఎంపీడీవో తిరుపతిరెడ్డి స్వచ్ఛ ధనం- పచ్చదనం కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పరిశుభ్రత పరిశీలించి, ఇళ్ల వద్ద నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, మండల ప్రత్యేక అధికారి రాజేశ్వర్, ఎంపీడీవో తిరుపతిరెడ్డి, ఏ పి ఓ ధర్మారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు క్రాంతి కుమార్, గడ్డం అరవింద్ రెడ్డి, వైద్య బృందం, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.