వన్ పల్లి గ్రామానికీ స్వచ్చ సర్వేక్షణ గ్రామీణ అవార్డ్ 

నవతెలంగాణ -వీర్నపల్లి 
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామనికి స్వచ్చ సర్వేక్షణ గ్రామీణ 2023 అవార్డ్ హైదరబాద్ లో స్వచ్చ సర్వేక్షణ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫార మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రిన్సిపాల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సులతనియా చేతుల మీదుగా సర్పంచ్ జోగిని పల్లి లత మల్లేశం అవార్డ్ ప్రధానం శాలువ తో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపిడివో నరేష్ మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత, ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ, రోడ్లపై మురికి కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేయకుండా శుభ్రంగా ఉంచడం, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు , గ్రామ పంచాయతీలు, ప్రార్థన స్థలాలు వంటి వాటిలో పరిశుభ్రతతను ఆగస్టు లో కేంద్ర బృందం పర్యటించి పరిశీలించి స్వచ్చ సర్వేక్షణ గ్రామీణ అవార్డ్ 2022- 2023 కు వన్ పల్లి గ్రామాన్ని ఎంపిక చేశారని ఎంపిడివో నరేష్ తెలిపారు. గ్రామ ప్రజల అందరి సహకారం కృషీ తోనే అవార్డ్ వచ్చిందని మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతి కార్యదర్శి ఉన్నారు.