
నవతెలంగాణ- తాడ్వాయి : ఆసియా ఖండంలో నే అతిపెద్ద ఆదివాసి గిరిజన జాతరైన మేడారం మహా జాతర సందర్భంగా ములుగు జిల్లా అటవీ శాఖ అధికారులతో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా గురువారం లింగాల రేంజ్ ఆఫీసర్ డి శ్రీరామ్ ఆధ్వర్యంలో లింగాల, కొడిశెల సెక్షన్లలో ఫారెస్ట్ అధికారులు లింగాల, కొడిశల అడవి ప్రాంతాలలో, రహదారి పొడవున, అటవీశాఖ కార్యాలయాల ముందు, గ్రామంలో చెత్తాచెదారం ప్లాస్టిక్ కవర్లు తొలగించి స్వచ్ఛ మేడారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లింగాల రేంజ్ అధికారి శ్రీరామ్ మాట్లాడుతూ మేడారం జాతరలో వచ్చే భక్తులు తీసుకొచ్చిన ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించామన్నారు. ఖమ్మం జిల్లా నుంచి గుండాల మీదుగా లింగాల, కొడిశెల, పసర ల మీదుగా మేడారం వెళ్తూ ప్లాస్టిక్ కవర్లు వ్యర్థ పదార్థాలు అడవి మార్గంలో పడేయడం మూలంగా కలుషితం ఏర్పడడం వలన, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించి స్వచ్ఛ మేడారం గా చేయాలన్న ధ్యేయంగా ముందుకు సాగుతున్నము అని అన్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాల వల్ల జరిగే అనర్ధాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించినట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగాల సెక్షన్ ఆఫీసర్ చందా ఆదినారాయణ, కొడిశల సెక్షన్ ఆఫీసర్ ముని, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు శివాజీ, సందీప్, కళ్యాణి, బీట్ ఆఫీసర్లు బెస్ క్యంప్ సిబ్బంది పాల్గొన్నారు.