
జక్రాన్పల్లి మండలం నారాయణపేట గ్రామంలో స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలు నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ రెండు వరకు గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా పక్షయోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆదివారం జాతీయ సమైక్య దినోత్సవం పురస్కరించుకొని గ్రామపంచాయతీలో జాతీయ జెండా వేసినట్టు తెలియజేశారు. అనంతరం గ్రామంలోని రోడ్లను శ్రమదానంలో భాగంగా వూడ్చడం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.