స్వచ్ఛత హి సేవ కోనేరు సుందరీ కరణ..

– డిఆర్డివో విజయలక్ష్మి..
నవతెలంగాణ-ముధోల్ : నియోజవర్గ కేంద్రమైన ముధోల్ లోని ముక్తా దేవి ఆలయం ఎదురుగా ఉన్న కోనేరును స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో భాగంగా సుంద్రీకరణ చేయనున్నట్లు డిఆర్డిఓ విజయలక్ష్మి తెలిపారు. శుక్రవారం ఆలయం ఎదురుగా ఉన్న కోనేరును పరిశీలించి పలు వివరాలను బిడిసీ  సభ్యులు,  గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం వారితో  చర్చించారు. మరమ్మత్తులు చేయించినట్లయితే భూగర్భ జలాలు పెరుగుతాయని చెప్పారు. దీంతో నీటి మట్టం భూమిలో పెరగడం వలన రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.  ఈ కోనేరు కొన్ని వందల సంవత్సరాల క్రితంకు సంబంధించిన కోనెరు అని  గ్రామస్తులు చెప్పారు .ఈ కోనేరు ప్రాశ్యాస్తం కలిగిందని, మరమ్మతులు చేయిస్తే ఉపయోగం లోకి  వస్తుందని గ్రామస్తులు తమ అభిప్రాయాలను తెలిపారు .సంబంధిత నివేదికను జిల్లా కలెక్టర్ కు నివేదించనునట్లు   డి ఆర్ డి ఓతెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శివకుమార్ ,ఏపీఓ శిరీషారెడ్డి ,పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ గౌడ్ ,మాజీ సర్పంచ్ వెంకటపూర్ రాజేందర్ ,మున్నూరు కాపు సంఘం తాలూకా అధ్యక్షులు రోళ్లరమేష్, బీడిసి అధ్యక్షుడు నారాయణ, నాయకులు  ధర్మపురిసుదర్శన్,తాటివర్ రమెష్,జీవన్, లవన్, తదితరులు పాల్గొన్నారు.