నవతెలంగాణ – నసురుల్లాబాద్
స్వచ్ఛ గ్రామాలే లక్ష్యంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుందని జాతీయ రహదారి అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. ఆదివారం బాన్సువాడ మండలంలోని సోమేశ్వర గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించామని ఎన్ హెచ్ 765 జాతీయ రహదారి అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీధర్ తెలిపారు. నేడు ఎన్ హెచ్ 765 జాతీయ రహదారి సిబ్బందితో ప్రతిజ్ఞ చేశారు. అలాగే సోమేశ్వర గ్రామంలో అపరిశుభ్రత చెత్తాచెదారం తొలగించారు మురికి కాలువలను శుభ్రం చేశారు. దీనితో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమానికి మంచి స్పందన కల్గిందన్నారు. ఎన్ హెచ్ 765 జాతీయ రహదారి సిబ్బందితో తదితర గ్రామాల్లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుందన్నారు.నేడు గ్రామాల్లో ఉన్న చెత్తాచెదారం తొలగించారు అధికారులు చీపిరి కట్ట పట్టి చెత్తాచెదారం ఊడ్చి వేశమన్నారు. గ్రామాల్లో స్వచ్ఛత ఉండేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఈ కార్యక్రమాలు జరగనున్నాయని. స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. మహాత్ముని జయంతి వేడుకల సందర్భంగా ప్రతి పంచాయతీల్లో స్వచ్ఛభారత్ మిషన్ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛతా హీ సేవా’ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ 765 జాతీయ రహదారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.