శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీతూ వర్మ హీరో యిన్‌గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా ఈనెల 4న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ, ‘ఎంత మంచి కథైనా తెరకెక్కాలన్నా.. అది ప్రేక్షకుల ముందుకు రావాలన్నా నిర్మాత కావాలి. టీజీ విశ్వ ప్రసాద్ వంద కాదు రెండు వందల సినిమాలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఈనెల 4న ఈ సినిమా గట్టిగా కొట్టబోతోంది. మిగతా సినిమాల కంటే ఈ సినిమాకి ఒక మెట్టు ఎక్కువ కష్టపడ్డాం. సినిమా చాలా ప్యాక్డ్‌గా వచ్చింది. ప్యాక్డ్‌గా ఉన్న థియేటర్స్‌లో చూడండి పిచ్చెక్కిపోతుంది. ఇది నా ప్రామిస్. తెలుగు ప్రేక్షకుల ప్రోత్సాహం వల్ల మేం గెలుస్తూ ఉంటాం. ఎన్నో విజయాలు అందించారు. ఈసారి మిమ్మల్ని నేను గెలిపించాలనుకుంటున్నా. మీకు సినిమా నచ్చితే సినిమా పూర్తయిన తర్వాత రెండు చప్పట్లు కొట్టండి. అంతకంటే ఎక్కువ ఆశించడం లేదు. ఈ సినిమాలో కథతో పాటు అద్భుతమైన కామెడీ, ప్యూర్ ఎమోషన్ ఉంటుంది. చాలా రోజుల పాటు ఇంపాక్ట్ చూపించే సినిమా’ అని అన్నారు.
‘ప్రతి సినిమాకి ఒక కమర్షియల్ మీటర్, స్పాన్ ఉంటుంది. ఒకొక్కసారి కంటెంట్ వున్నప్పుడు, మార్కెట్ కి మించిన స్పాన్ వున్నప్పుడు చేసే సినిమాలు కొన్ని వుంటాయి. అలా చేసిన వాటిలో మాకు గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ2 చాలా పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ఇది కూడా అలాంటి కేటగిరీలోకే వస్తుంది. అలాంటి సక్సెస్ వస్తుంది. ఈ మూవీలో శ్రీవిష్ణుని కమల్ హాసన్‌తో పోల్చడం అనేది ధైర్యంగా చెప్పొచ్చని భావిస్తున్నాను. ఇందులో శ్రీవిష్ణు చేసిన క్యారెక్టర్స్ దేనికవి యూనిక్‌గా ఉంటాయి. హసిత్ అద్భుతంగా తీశాడు. వివేక్ సాగర్ మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది’ అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ, ‘ఈనెల 4న బెస్ట్ ఇంటర్వెల్, బెస్ట్ క్లైమాక్స్, బెస్ట్ మూవీని చూడబోతున్నారు. దసరా అయిపోయిన తర్వాత కూడా ఈ సినిమాని ఇంకా చూస్తూనే ఉంటారనేది నా నమ్మకం’ అని అన్నారు.