మహిళా సంఘాల నిధులు స్వాహా..

– రూ 37 లక్షల నిధులు స్వాహా చేసిన వివో ఏ
– బహిరంగ విచారణలో వెల్లడి-
– అధికారుల నిర్లక్ష్యమే అంటున్న మహిళలు
నవతెలంగాణ – తాడ్వాయి
నెలనెలా పొదుపులు చేసుకుని స్వయం ఉపాధి పొందుదామన్న మహిళలకు నిరాశే మిగులుతుంది. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుంటున్న వీఎవోలు అందినంతకు దోచుకుంటున్నారు. గ్రామ సంఘాలలోని మహిళలు తీసుకుంటున్న బ్యాంకు రుణాలలో, మహిళా సంఘంలో తీసుకున్న రుణాలలో వీవోఏ లు భారీ అక్రమాలకు పాల్పడుతున్నారు . కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ మహిళా సంఘాలలో రూ .37 లక్షల నిధులు స్వాహా అయిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తాడువాయి మండలంలోని నందివాడ గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం ఐకెపి పిడి సాయన్న బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ విచారణలో గ్రామ సంఘాలలో విఏవోగా విధులు నిర్వహిస్తున్న తాటిపాముల బాబా గౌడ్ రూ 37 లక్షలు స్వాహా చేసినట్లు అధిజారులు తేల్చారు.పక్కా ప్రణాళికతో చాకచక్యంగా అధికారులకు చిక్కకుండా వివో ఏ నిధుల స్వాహాకు పాల్పడ్డాడు. అమ్మ పద్మ, చిన్నమ్మ సిద్ధవ్వ, భార్య జ్యోతి, తన బ్యాంక్ అకౌంట్లోకి మహిళా సంఘాల డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు మహిళలు తీసుకున్న రుణాలలో తాను అనుకున్నంత డబ్బును తన తల్లి ,చిన్నమ్మ, భార్య ,తన పేరుపై ఉన్న బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పక్కాగా మళ్ళించాడు. తల్లి అకౌంట్లోకి రూ 5. 92 లక్షలు ,చిన్నమ్మ సిద్ధవ అకౌంట్లోకి రూ. 30 వేలు,భార్య జ్యోతి అకౌంట్లోకి 9.85 లక్షలు, తన అకౌంట్లోకి రూ.1 లక్ష ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఒక్కో సభ్యురాలు అకౌంట్ నుంచి రూ 30 వేల నుంచి రూ.1.10 లక్షల వరకు నిధులు మళ్లించడంపై అధికారులు నివ్వెర పోయారు. అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీన వైఖరి వల్లే భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహిళా సంఘాల రుణాలు పక్కదారి పట్టకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసమే సీసీలను ,ఏపీఎంలను నియమించింది కానీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం కారణంగానే నిధులు స్వాహా అయ్యాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
– బ్యాంకు రుణాలలో రూ.30.8 3 లక్షల నిధులు పక్కదారి
– మహిళలు వివిధ అవసరాల కోసం బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలలో వివో ఏ బాబా గౌడ్ పక్కా ప్రణాళికతో రూ. 30.8 3 స్వాహా చేశారు సభ్యురాలు బ్యాంకులో తీసుకున్న రుణాలను వాయిదాల పద్ధతిలో బ్యాంకు లోనే జమ చేయాలి కానీ నిబంధనలకు విరుద్ధంగా బాబా గౌడ్ తన ఇష్టానుసారంగా మహిళల నుంచి నగదును తీసుకొని బ్యాంకులో జమ చేయకుండా తన సొంతానికి వాడుకున్నారు. తన స్వంతానికి వాడుకున్న డబ్బులను సైతం సంఘ సభ్యులతో బ్యాంకులలో వాయిదాలు రూపంలో కట్టించాడు.
– శ్రీనిధి రుణాలలో రూ 6.73 లక్షల స్వాహా
– మహిళలు తమ అత్యవసరాలకు తీసుకున్న శ్రీనిధి రుణాలలో సైతం బాబా గౌడ్ రూ.6.73 లక్షల నిధుల స్వాహా కు పాల్పడ్డాడు. పక్కా స్కెచ్ తో ఒక్కో మహిళ సభ్యురాలు నుంచి పక్కాగా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు పక్కదారి పట్టించాడు బ్యాంకులో రూ 50 వేలు చెల్లించాల్సి ఉండగా బాబా గౌడ్ రూ.60 వేలు కట్టించుకున్నాడు
– గ్రామంలో 10 రోజులపాటు విచారణ
– బాబా గౌడ్ అక్రమాలపై డిపిఎం రవీందర్ రావు 10 రోజులపాటు గ్రామంలో విచారణ నిర్వహించారు ప్రతి గ్రూప్ సంఘంలో పుస్తకాలను పరిశీలించి ఇంటింటికి వెళ్లి సభ్యురాలు నుంచి వివరాలు సేకరించారు బ్యాంకు లావాదేవీలు సేకరించి జరిగిన అవకతవకలను వెలికి తీశారు
– సిబ్బందిపై కఠిన చర్యలు
– ఐకెపిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పిడి సాయన్న హెచ్చరించారు.ఇక్కడ విధులు నిర్వహిస్తున్న సిసి సాయిబాబాను సస్పెండ్ చేస్తున్నట్లు పిడి సాయన్న వెల్లడించారు. ఎప్పటికప్పుడు బాధ్యతాయుతంగా పుస్తకాలను పరిశీలించాల్సిన సిసి పుస్తకాలను పరిశీలించకపోవడంతోనే నిధులు పక్కదారి పట్టినట్లు పిడి తేల్చారు. వివో ఏ బాబా గౌడ్ ను సస్పెండ్ చేశారు. ఏపిఎం కు శ్లోకాదు నోటీసులు జారీ చేశారు.
– నిధుల రికవరికి చర్యలు
– స్వాహా అయిన రూ .37 లక్షల నిధుల రికవరికి చర్యలు తీసుకుంటున్నట్లు పిడి సాయన్న వివరించారు.ఈ డబ్బులను 6 నెలల వాయిదాతో చెల్లించాలని బాబా గౌడ్ ను పిడి ఆదేశించారు. రెండు నెలలకు ఒక వాయిదా పద్ధతిలో డబ్బులను పూర్తిస్థాయిలో చెల్లిస్తానని బాబాగౌడు ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయమై గ్రామ సర్పంచ్,ఏపీడి , వీడీసీ సభ్యులు, ఏపిఎంలతో ఒప్పంద పత్రం వ్రాయించారు ఈ కార్యక్రమంలో ఏపీ డి శివకృష్ణ ,డిపిఎం రవీందర్ రావు ,సర్పంచ్ తాటిపాముల స్వాతి వినోద్ గౌడ్, ఎంపీటీసీ లింగవ్వ సాయిలు, ఏపిఎం రవీందర్ ,సీసీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు