యువజన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా స్వామి గౌడ్‌

నవతెలంగాణ-నార్కట్‌పల్లి
నకిరేకల్‌ నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బ్రాహ్మణవెళ్లెంల గ్రామానికి చెందిన బోడిగె స్వామిగౌడ్‌ను నియమిస్తూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదివారం నియామకపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ భారీ మెజారిటీతో గెలుపు కొరకు నా శాయశక్తుల కషిచేస్తానని, తనపై నమ్మకం ఉంచి తన నియామకానికి సహకరించిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి,మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, నకిరేకల్‌ మాజీఎమ్మెల్యే వీరేశంకు,యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు శివసేనరెడ్డికి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు బత్తుల ఊషయ్యకు, ఎంపీటీసీలఫోరం జిల్లా పాశం శ్రీనివాస్‌రెడ్డి హదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.